మిరపలో నారుకుళ్లు తెగుల సమగ్ర సస్యరక్షణ

ఈ తెగుళ్లని శిలీంధ్రపు తెగుళ్లు లేదా మాగుడు తెగులు లేదా నారుకుళ్లు తెగులు అని అంటారు. ఇప్పుడు మనం మిరపలో ఈ తెగుళ్లని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం.

కారణం: పితియం అనే శిలింద్రం

లక్షణాలు:

  • మొదటి దశలో లేత మొక్కలు భూమి నుండి బయటకు రాక ముందే చనిపోతాయి.
  • రెండవ దశలో మొక్కలు మొలచి పెరుగుతున్న దశలో నారు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఈ తెగులు సోకినా మొక్కలలో నేలకు దగ్గరగా ఉన్న కాండం మృదువుగా నీటిలో నానినట్లు ఉండి, గోధుమ రంగు మచ్చ ఏర్పడి క్రమంగా కృశించి సన్నగా దారం వలె కనిపిస్తుంది. అటువంటి మొక్కలు నిటారుగా నిలబడలేక నేలపై వాలి చనిపోతాయి.

సమగ్ర నివారణ:

  • మిరప నారును భూమికి 15 సెం.మీ. ఎత్తులొ అలకాలి.
  • గుంపుగా ఉన్న నారుని తొలగించాలి.
  • వేసవి దుక్కీలను పాటించాలి.
  • ఒక కిలో విత్తనానికి 10గ్రా. ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా హర్జియానమ్ ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ @ 5-10 మి.లీ / కేజీ విత్తనంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి.

నులిపురుగులు నివారణ

రసాయన నివారణ:

  • నివారణ చర్యగా, కాప్టాన్ 75% WS @ 15-25  గ్రా. లేదా కార్బెండజిమ్ 50% WP @ 2  గ్రా లేదా మెటలాక్సిల్- M 31.8% ES @ 2  గ్రా. లేదా మెటలాక్సిల్- M 31.8% ES @ 0.64 గ్రా ను ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి.
  • నియంత్రించడానికి, కాప్టాన్ 75% WP @ 2.5 గ్రా./ లి. నీటికి  లేదా మాన్‌కోజెబ్ 75% WP @ ౩ గ్రా./ లి. నీటికి  లేదా మెటలాక్సిల్ 4% + మాంకోజెబ్ 64% WP@ 2.5 గ్రా./ లి. నీటికి  లేదా కోపెరాక్సిక్లోరైడ్ @ ౩  గ్రా./ లి. నీటికి కలిపి నారును తడపాలి.

ఈ విధంగా చేసినట్లయితే మిరపలో నారుకుళ్లు తెగుళ్లను తేలికగా నివారించుకోవచ్చు. మరిన్ని వివరాలకు క్రింద కమెంట్ చేయండి.

ధన్యవాదాలు...!!!

Sharing is Caring